అక్షరటుడే, కమ్మర్పల్లి: Government Schemes | ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి (Manala Mohan Reddy) పేర్కొన్నారు. రుద్రంగి మండలంలో ఆదివారం ఉమ్మడి మానాల గ్రామ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించగా.. రాష్ట్ర వెలమ కార్పొరేషన్ అధ్యక్షుడు జువడి నర్సింగ్ రావుతో కలిసి పాల్గొన్నారు.
Government Schemes | పథకాలను లబ్ధిదారులకు అందజేయాలి..
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma Housing Scheme), గృహజ్యోతి, ఉచిత బస్సు ప్రయాణం, సన్న వడ్ల బోనస్, రైతుబంధు, రైతు భరోసా, రూ.500కే గ్యాస్ సిలిండర్ అర్హులందరికీ రేషన్ కార్డులు (Ration Cards) అందిస్తోందన్నారు. ఈ విషయాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జలపతి, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ గంగ నర్సయ్య, మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుపతి, లక్ష్మణ్ నాయక్, భీమ్గల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ జేజే నర్సయ్య, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నారాయణ, వివిధ గ్రామాలకు సంబంధించిన సర్పంచులు, ఉప సర్పంచ్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Oman Indian Vessel | ఒమన్ తీరంలో చిక్కుకున్న భారత నౌక.. 14 మంది సిబ్బంది క్షేమం