అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Rain Review | వర్షాలు, ప్రకృతి విపత్తులపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాలపై జూన్ 1న రివ్యూలో ముందస్తు సూచనలు ఇచ్చినా.. 9న వర్షం వస్తే అధికారులు సరిగా పనిచేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వర్షం సమయంలో క్యూర్ (CURE) ప్రాంతంలో.. మున్సిపల్, పోలీస్ అధికారుల మధ్య సమన్వయం లేదని సీఎం సీరియస్ అయ్యారు. ఫీల్డ్‌లో ఉండని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్‌శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలన్నారు.
CM Rain Review | రోడ్లపై ఉండాలి

వర్షం పడేటప్పుడు ట్రాఫిక్ ఉన్నతాధికారులతో పాటు.. కిందిస్థాయి సిబ్బంది రోడ్లపై ఉండాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. అవసరం అయితే తాను కూడా రోడ్డు మీదకి వస్తానని తెలిపారు. వాటర్ లాగింగ్ పాయింట్స్, బ్లాక్ స్పాట్స్‌తో పాటు, ట్రాఫిక్ జామ్ (Traffic Jam) ఏర్పడే ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. వర్షంతో ట్రాఫిక్ జామ్ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మానవ తప్పిదాల వల్ల సమస్యలు వస్తే సహించనని పేర్కొన్నారు. ట్రాఫిక్ విభాగంలో తక్షణమే ఖాళీలు భర్తీ చేయాలన్నారు.
దీనిని కూడా చదవండి : Morena Train Accident | ప్రాణం తీసిన వదంతులు.. రైలు ఢీకొని నలుగురి మృతి