Prajavani Complaints | ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్​

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని నిజామాబాద్​ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Prajavani Complaints | ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని నిజామాబాద్​ కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు.

Prajavani Complaints | 135 ఫిర్యాదుల స్వీకరణ..

జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్​తో పాటు, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, ట్రెయినీ కలెక్టర్ సురేష్, డీఆర్​వో గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డిలకు విన్నవించారు. ఫిర్యాదులను పెండింగ్​లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

Prajavani Complaints | విద్యాసంస్థల్లో సౌకర్యాలను తనిఖీ చేయాలి

ప్రజావాణి అనంతరం కలెక్టర్ అధికారులకు పలు అంశాలపై సూచనలు చేశారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయినందున అన్ని వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. జిల్లా అధికారులతో పాటు మండల స్పెషల్ ఆఫీసర్లు, ఆర్సీవోలు విధిగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. బాలికల పాఠశాలల్లో ఎక్కడైనా టాయిలెట్స్ అవసరం ఉన్న పక్షంలో తక్షణమే ప్రతిపాదనలు పంపాలన్నారు. ఈనెల 25 నుంచి జూలై 24 వరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ కొనసాగనుందని, ఈ ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు అందరూ బీఎల్వోలను సంప్రదించి మ్యాపింగ్​ పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Urea Stocks Nizamabad | యూరియా నిల్వలపై ఆందోళన వద్దు: ముత్యాల సునీల్ కుమార్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *