Stock Market Gains | లాభాల్లో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో కొనసాగుతోంది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 311 పాయింట్లు, నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Gains | అమెరికా -ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం తర్వాత ముడిచమురు ధరలు దిగివస్తున్నాయి. దీనికితోడు వరుసగా 13 సెషన్ల పాటు నికర అమ్మకందారులుగా కొనసాగిన ఎఫఐఐలు గత సెషన్‌లో నికర కొనుగోలుదారులుగా మారారు.

మరోవైపు రూపాయి విలువ సైతం బలపడుతోంది. దీంతో ఇన్వెస్టర్లు ఆశావహ దృక్పథంతో కొనుగోళ్లకు మద్దతుగా నిలుస్తుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్‌లో ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు మంగళవారం వరుసగా మూడో సెషన్‌లోనూ ర్యాలీని కొనసాగిస్తున్నాయి.

Stock Market Gains | స్వల్ప రేంజ్‌లో..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 262 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 76,443 నుంచి 76,724 పాయింట్ల రేంజ్‌లో, నిఫ్టీ 23,888 నుంచి 23,977 పాయింట్ల రేంజ్‌లో కదలాడుతున్నాయి. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 311 పాయింట్ల లాభంతో 76,575 వద్ద, నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో 23,923 వద్ద ఉన్నాయి.

Stock Market Gains | మిక్స్‌డ్‌గా సూచీలు..

రియాలిటీ ఇండెక్స్ 1.31 శాతం, ఐటీ 1.08 శాతం, మీడియా 1.01 శాతం, ఎఫ్ ఎంసీజీ ఇండెక్స్ 0.90 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.62 శాతం, ఎనర్జీ 0.60 శాతం, పవర్ 0.53 శాతం లాభాలతో ఉండగా.. మెటల్ ఇండెక్స్ 1.62 శాతం, ఫార్మా 0.49 శాతం, ఆటో 0.23 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 22 స్టాక్స్ లాభాలతో, 8 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్‌సీఎల్ టెక్ 2.21 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.79 శాతం, రిలయన్స్ 1.40 శాతం, హెచ్యూఎల్ 1.39 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.37 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : టాటా స్టీల్ 1.47 శాతం, ఎస్బీఐ 0.89 శాతం, ఇండిగో 0.78 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.74 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.64 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: June 16 Gold Prices | మళ్లీ పసిడి పరుగులు.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *