Gurukul Tender Scam | గురుకుల టెండర్లలో స్కామ్​ : హరీశ్​రావు

గురుకుల పాఠశాలల్లో పిల్లలకు పెట్టే గుడ్లు, పప్పులో రూ.2000 కోట్ల స్కామ్ చేశారని మాజీ మంత్రి హరీశ్​రావు ఆరోపించారు.

Shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gurukul Tender Scam | గురుకుల పాఠశాలల్లో పిల్లలకు పెట్టే గుడ్లు, పప్పులో రూ.2000 కోట్ల స్కామ్ చేశారని మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao) ఆరోపించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ ఆయన సవాల్ విసిరారు.

తాము రూ.650 కోట్లకు కొంటే రూ.2000 కోట్ల స్కామ్ ఎక్కడి నుండి వచ్చిందని అంటున్నారని.. మీ డిపార్టుమెంట్లో మంత్రులుగా ఉండి అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారని విమర్శించారు.

గురుకుల విద్యార్థుల యూనిఫాంలు, టైల కోసం రూ.1200 కోట్ల టెండర్ పిలిస్తే, ఉప్పులు, పప్పులు, చికెన్ కోసం రూ.800 కోట్ల టెండర్ పిలిచారన్నారు. రెండు కలిపితే రూ.2000 కోట్లు అయిందని చెప్పారు. టెండర్లు పిలిచిన విషయం మంత్రులకు తెలియకపోతే ఏం పాలన చేస్తున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రే మొత్తం టెండర్లు పిలిచి ఆ అనుముల అన్నా తమ్ముళ్లు మొత్తం దోచుకుంటున్నారని ఆరోపించారు.

Gurukul Tender Scam | వాళ్లు కోటీశ్వరులు అయ్యారు

కోటిమంది మహిళలను కోటీశ్వర్లను చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారని హరీశ్​రావు అన్నారు. కోటి మంది మహిళలు కోటీశ్వర్లు కాలేదు కానీ అనుముల వారి నలుగురు అన్నా తమ్ముళ్లు మాత్రం కోటీశ్వర్లు అయ్యారని ఆరోపించారు. సీఎం రేవంత్​రెడ్డికి కేసీఆర్ మీద కోపమో.. లేదా రైతుల మీద కోపమో తెల్వదు కానీ రైతుబీమా పథకం బంద్​ చేశారన్నారు. నాలుగు నెలల నుంచి ఎల్​ఐసీకి డబ్బులు కట్టడం లేదన్నారు. దీంతో ఎవరైనా రైతు చనిపోతే డబ్బులు రావడం లేదని తెలిపారు.

Gurukul Tender Scam | 19 వేల ఖాళీలు

కొత్త డీజీపీ సీవీ ఆనంద్ పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు ఉన్నాయని చెప్పినట్లు మాజీ మంత్రి గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఏమో కేవలం 5 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని అంటున్నారని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ 17 వేల ఖాళీలు ఉంటే 17 వేలకు నోటిఫికేషన్లు ఇచ్చారని, మరి రేవంత్ రెడ్డి ఎందుకు 5 వేల ఉద్యోగాలే భర్తీ చేస్తున్నారని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి..: Kavitha Singareni Comments | సింగరేణి అధికారులపై కవిత ఆగ్రహం..అన్నలందరూ మా పార్టీలోనే ఉన్నారంటూ వార్నింగ్

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *