Woman Prisoner Missing | జీజీహెచ్​లో మహిళా ఖైదీ మిస్సింగ్​ కలకలం..

Srinivas Kolluri

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Woman Prisoner Missing | నిజామాబాద్​ ప్రభుత్వ జనరల్​ ఆస్పత్రి (GGH)లో బుధవారం ఓ మహిళా ఖైదీ హల్​చల్ చేసింది. పోలీసుల కళ్లు గప్పి ఆమె తప్పించుకుంది. దీంతో వారు ఆందోళనకు గురై ఆస్పత్రి మొత్తం జల్లెడ పట్టారు.

బాన్సువాడలో (Banswada) ఒక చోరీ కేసులో నిందితురాలు అయినా మహిళా ఖైదీ శ్రావణి తన బిడ్డతో కలిసి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బుధవారం వాష్​రూమ్​కు అని చెప్పి ఆమె తప్పించుకుంది. పై అంతస్తుకు వెళ్లి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె రైట్ సైడ్ మెన్ గేట్ నుంచి మిస్ అయినట్లుగా పోలీసులు అనుమానించారు.

Woman Prisoner Missing | సీసీ కెమెరాలు పరిశీలించడంతో..

ఆస్పత్రి ఎంట్రెన్స్​, ఎగ్జిట్ గేట్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. వాటి నుంచి ఆమె బయటకు వెళ్లినట్లు రికార్డు కాలేదు. దీంతో ఖైదీ శ్రావణి ఆస్పత్రిలోనే దాక్కున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఆస్పత్రి మొత్తం జల్లెడ పట్టారు. మహిళా ఖైదీ గంట సేపు పోలీసులకు చుక్కలు చూపించింది. అనంతరం ఆమెను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దీనిని కూడా చదవండి : Jeevan Reddy | ‘ఆశన్నగారి’ అడుగులు ఎటువైపు..?

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *