RTA Vehicle Inspections | జిల్లావ్యాప్తంగా ఆర్టీఏ అధికారుల విస్తృత తనిఖీలు..

జిల్లాలో ఆర్టీఏ అధికారులు స్కూల్ బస్సులను తనిఖీ చేస్తున్నారు. బస్సులకు ఫిట్​నెస్​ లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ/ఆర్మూర్​: RTA Vehicle Inspections | జిల్లావ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఫిట్​నెస్​ లేకుండా రోడ్లపైకి వస్తున్న బస్సులను పరిశీలిస్తూ జరిమానాలు విధిస్తున్నారు.

RTA Vehicle Inspections | నిజామాబాద్​ నగరంలో..

నిజామాబాద్​ (Nizamabad) నగరంలో డిప్యూటీ ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్​ దుర్గా ప్రమీల ఆదేశాల మేరకు ఆర్టీవో సంతోష్​ నాయక్​ తనిఖీలు చేపట్టారు. ఉదయాన్నే విద్యార్థులతో రోడ్ల పైకి వచ్చిన బస్సులను పరిశీలించారు. బస్సు ఫిట్​నెస్​, డ్రైవర్ల లైసెన్స్​లు, ఫస్ట్​ ఎయిడ్​ కిట్స్​, ఫైర్​ సేఫ్టీ పరికరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 800కు పైగా స్కూల్​ బస్సులు ఉండగా కొన్ని ఇంకా ఫిట్​నెస్​ పూర్తి చేసుకోలేదన్నారు. ఈ తనిఖీల ప్రక్రియ నిరంతరంగా సాగుతుందని.. బస్సులతో వాహనదారులు రోడ్లపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా తమ వెంట లైసెన్స్​, ధ్రువపత్రాలు తీసుకెళ్లాలన్నారు. ఆర్టీఏ అధికారులకు సహకరించాలని కోరారు.

RTA Vehicle Inspections | ఆర్మూర్​ పట్టణంలో..

RTA Vehicle Inspections

పట్టణంలో గురువారం ఆర్మూర్ ఎంవీఐ రాహుల్ కుమార్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా  పరిమితికి మించి స్కూల్ విద్యార్థులను తరలిస్తున్న ఆటోలను సీజ్ చేశారు. స్కూల్​ బస్సులు తప్పనిసరిగా ఫిట్​నెస్​ చేయించుకోవాలని, వాహనపత్రాలు డ్రైవింగ్ లైసెన్స్​లు తప్పనిసరి అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వాహనాలను సీజ్ చేసి ఆర్టీఏ యాక్ట్​ ప్రకారం చర్యలు తీసుకుంటామని   హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంవీఐ రోహిత్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Kidney Cancer Awareness | ప్రపంచ కిడ్నీ క్యాన్సర్ డే – ముందస్తు గుర్తింపుతో కిడ్నీ క్యాన్సర్‌కు చెక్​ : డా. అజయ్ కుమార్ పాటిల్

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *