అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad Police | కన్నతండ్రే కాలయముడిగా మారాడు. రెండున్నర నెలల తన కొడుకుని నగరంలోని (nizamabad) రైల్వే ట్రాక్(Railway Track) సమీపంలో నిర్దయగా హత్య చేశాడు. ఈ అమానుష ఘటన నగరంలో కలకలం రేపింది.
Nizamabad Police | మిర్చి కాంపౌండ్ ప్రాంతంలో..
నగరంలోని మిర్చి కాంపౌండ్ ప్రాంతానికి చెందిన యువరాజ్ దంపతులకు రెండున్నర నెలల బాబు ఉన్నాడు. కానీ ఈ బాబు తనకు పుట్టలేదని అనుమానంతో అతడు నిత్యం భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి నగరంలోని రైల్వే ట్రాక్ పక్కకు బాబును తీసుకొచ్చి కత్తితో నరికి హత్య చేశాడు. రైల్వే ట్రాక్ పక్కన బాలుడి మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన ఎస్‌హెచ్‌వో రఘుపతి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : NEET Re Exam | నీట్ పరీక్షకు లైన్ క్లియర్.. రీ-ఎగ్జామ్‌పై జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు
Child Murder, Nizamabad Crime, Crime News, Railway Track Incident, Police Investigation, Telangana News, Family Tragedy, Breaking News