అక్షరటుడే వెబ్‌డెస్క్: Bengaluru Mobile Theft | బెంగళూరులో మొబైల్ చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. దొంగతనం చేసి పారిపోతుండగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో, వారిలో ఒకరు గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందగా, మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Bengaluru Mobile Theft | ఏం జరిగిందంటే..
కర్ణాటక రాజధాని బెంగళూరులోని కబ్బన్‌పేట్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు దొంగలు బైక్‌పై వచ్చి, దారిలో వెళ్తున్న ఒక వ్యక్తిని అడ్డుకుని అతని వద్ద ఉన్న మొబైల్‌ను లాక్కున్నారు. అనంతరం అక్కడి నుంచి వేగంగా పారిపోయేందుకు ప్రయత్నించారు. బాధితుడు వారిని వెంబడించాడు. దీనిని గమనించిన మరో వ్యక్తి దొంగలపై సంచిని విసిరేశాడు. ఈ ఒక్క దెబ్బతో బైక్ అదుపు తప్పి దొంగలు కింద పడిపోయారు.

Bengaluru Mobile Theft | కుప్పకూలాడు
ప్రమాదం జరిగిన వెంటనే ఆ దొంగలు తేరుకుని పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే, ఆ సమయంలో వారిలో జునేద్ అనే దొంగకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. జునేద్తో పాటు ఉన్న మరొక దొంగ అర్బాజ్ పారిపోయేందుకు ప్రయత్నించగా, అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై అతడిని పట్టుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
CCTV Footage
మొబైల్ చోరీ చేసి పారిపోతుండగా.. గుండెపోటుతో దొంగ మృతి
కర్ణాటక రాజధాని బెంగళూరులోని కబ్బన్‌పేట్‌లో జరిగిన ఘటన
ఇద్దరు దొంగలు బైక్‌పై వచ్చి.. ఓ వ్యక్తి నుంచి ఫోన్ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నం
ఇది గమనించి.. తాను ఎత్తుకెళ్తున్న సంచిని బైక్‌పై విసిరేయడంతో కింద పడిన… pic.twitter.com/FtqGgfKmPR
— PulseNewsBreaking (@pulsenewsbreak) June 20, 2026
ఇది కూడా చదవండి: KBR Park Traffic Restrictions | నగరవాసులకు అలర్ట్.. రేపు కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు