అక్షరటుడే, వెబ్‌డెస్క్ : India vs Afghanistan ODI | అఫ్గానిస్థాన్‌పై మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.
చెన్నై శనివారం మూడో వన్డే జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు 44.2 ఓవర్లకు 218 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆ జట్టును కెప్టెన్ హస్మతుల్ల షాహిదీ ఆదుకున్నాడు. 131 బంతుల్లో 102 పరుగులతో రాణించాడు. అజ్మతుల్ల 50 పరుగులతో అతడికి సహకారం అందించాడు. మిగతా బ్యాటర్లు విఫలం అయ్యారు. దీంతో అఫ్గానిస్థాన్ 218 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్ ప్రసిద్ కృష్ణ 5 వికెట్లు తీశాడు.

India vs Afghanistan ODI | దంచికొట్టిన జైస్వాల్
భారత జట్టు 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మ దంచికొట్టారు. జైస్వాల్ 86 బంతుల్లో 110 పరుగులు (నాటౌట్) చేసి రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు రోహిత్ శర్మ సైతం బ్యాట్ ఝుళిపించాడు. 69 బంతుల్లో 79 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యార్ 20 పరుగులు చేశాడు. దీంతో భారత్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 28.4 ఓవర్లలో విజయం సాధించింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో భారత్ తొలి సిరీస్‌ను గెలుపొందింది.
🔹 3rd ODI | IND 🇮🇳 vs AFG 🇦🇫 🔹
IND 🇮🇳 : 1️⃣4️⃣8️⃣-0️⃣ (20 Overs)
Jaiswal*: 7️⃣3️⃣⁶⁴
Rohit* : 6️⃣2️⃣⁵⁸INDIA 🇮🇳 NEED 7️⃣1️⃣ RUNS MORE TO WIN#INDvAFG #TeamIndia #INDvsAFG #ODI #Cricketpic.twitter.com/BrX2dEWZaN https://t.co/LXknPFqRzw
— Cricket Lover 🏏 (@Crick97924Lover) June 20, 2026
దీనిని కూడా చదవండి : Maharashtra Temple Collapse | మహారాష్ట్రలో విషాదం.. మండపం కూలి ఆరుగురు మృతి!