Kamareddy Ganja Seizure | కామారెడ్డిలో భారీగా గంజాయి పట్టివేత..! సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్న అధికారులు

Naresh Chandan

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Ganja Seizure | కామారెడ్డి జిల్లాలో మరోసారి గంజాయి అక్రమ రవాణా వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో 20 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన మరువకముందే, జిల్లాలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.

Kamareddy Ganja Seizure | రహదారిపై తనిఖీల్లో..

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, కామారెడ్డి జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై పోలీసులు, ప్రత్యేక బృందం సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో సుమారు మూడు క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

Ganja Seizure

Kamareddy Ganja Seizure | అత్యంత గోప్యం

పట్టుబడిన గంజాయి భిక్కనూరు సర్కిల్ పరిధిలో స్వాధీనం చేసుకున్నారా..? లేక దేవునిపల్లి సర్కిల్ పరిధిలో పట్టుకున్నారా..? అనే విషయంలో స్పష్టత లేకపోవడం గమనార్హం. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

మరోవైపు, గంజాయిని పండ్ల లోడుతో వెళ్తున్న వాహనంలో తరలిస్తున్న సమయంలో గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఎంతమంది ఉన్నారు, వారిని అదుపులోకి తీసుకున్నారా.. లేదా..? అనే విషయాలపై అధికారుల నుంచి ఎలాంటి నిర్ధారణ లేదు.

అధికారిక సమాచారం కోసం ప్రజలు, స్థానిక వర్గాలు ఎదురుచూస్తుండగా, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

Japan Population Crisis | సూర్యుడు ఉదయించే దేశంలో.. శృంగార అస్తమయం!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *