అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Ashok Sagar Death | అశోక్‌సాగర్‌లో నీటిలో మునిగి ఓ బ్యాంకు ఉద్యోగి మృతిచెందిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతుడు నగరంలోని ఎస్‌బీఐ ప్రగతినగర్ శాఖలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న కొటారికారి శ్రీధర్‌గా గుర్తించారు.
Ashok Sagar Death |
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీధర్ ఆదివారం ఉదయం ఇంటి నుంచి వాకింగ్‌కు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. అనంతరం బ్యాంకులో పని ఉందని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన ఆయన ఇంటికి తిరిగి రాలేదు.
అయితే, సాయంత్రం అశోక్‌సాగర్‌లో నీటిలో మునిగి శ్రీధర్ మృతిచెందినట్లు సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు ఘటనాస్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. వారి రోదనలు అక్కడి వారిని కలిచివేశాయి.
కాలకృత్యాలు తీర్చుకునేందుకు అశోక్‌సాగర్‌లోకి దిగిన సమయంలో ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందినట్లు భార్య లత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.