ACB Raids | ఎక్సైజ్​ శాఖలో కలకలం.. సూపరింటెండెంట్​ ఇంట్లో ఏసీబీ సోదాలు..

నిజామాబాద్​ ఎక్సైజ్​ సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు కలకలం సృష్టించాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆయనపై కేసు నమోదు అయింది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: ACB Raids | ఎక్సైజ్​ సూపరింటెండెంట్ (Excise Department) ఇంట్లో ఏసీబీ సోదాలు కలకలం సృష్టించాయి. నగరంలోని ఆయన నివాసంలో ఉదయం నుంచే సోదాలు జరిగాయి.

ACB Raids | నగరంలోని ఆయన నివాసంలో..

నగరంలోని (Nizamabad) ప్రగతినగర్​లోని సూపరింటెండెంట్​​ మల్లారెడ్డిలో ఇంట్లో ఏసీబీ అధికారులు ఉదయం నుంచే సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై ఆయన ఇంట్లో తనిఖీలు చేశారు. అలాగే రాష్ట్రావ్యాప్తంగా ఆయనకు సంబంధించిన వారి ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నట్లుగా సమాచారం. ఈ సందర్భంగా కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నఏసీబీ అధికారులు.. మల్లారెడ్డిని అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం తరలించినట్లు తెలుస్తోంది. తనిఖీల అనంతరం ఏసీబీ అధికారులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

mallreddy4

ఇది కూడా చదవండి: రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *