అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyderabad Metro expansion | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) తన ఢిల్లీ పర్యటనను కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ, ఐఆర్‌ఎఫ్‌సీ (IRFC) రుణం , రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల ఆమోదం కోసం ఆయన కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమవుతున్నారు.
Hyderabad Metro expansion | మంత్రులతో వరుస సమావేశాలు..
ముఖ్యమంత్రి నిన్న కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. ఇవాళ కేంద్ర గృహ నిర్మాణ , పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొనడం గమనార్హం. నిన్న అశ్వినీ వైష్ణవ్‌ను కలిసే సమయంలోనూ, ఇవాళ ఖట్టర్‌తో జరిగిన భేటీలోనూ కిషన్ రెడ్డి ముఖ్యమంత్రితో కలిసి ఉన్నారు.

Hyderabad Metro expansion | మెట్రో విస్తరణపై ఒత్తిడి..
గతంలో మెట్రో విస్తరణ విషయంలో కేంద్రంపై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలు చేసిన ముఖ్యమంత్రి, ఇప్పుడు నేరుగా కేంద్ర మంత్రులతో కలిసి చర్చలు జరుపుతుండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సంబంధిత శాఖల మంత్రులు ఒకే వేదికపైకి రావడం వల్ల మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించి ఉన్న అడ్డంకులు తొలగి, త్వరలోనే పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
Hyderabad Metro expansion | ముఖ్యమంత్రి ప్రెస్ మీట్..
నిన్నటి సమావేశం సానుకూలంగా జరిగిందని స్వయంగా ముఖ్యమంత్రే వెల్లడించారు. ఇవాళ మనోహర్ లాల్ ఖట్టర్‌తో జరిగిన చర్చల సారాంశం, మెట్రో విస్తరణ ప్రాజెక్టుపై తీసుకున్న నిర్ణయాలను మరికాసేపట్లో ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో వివరించనున్నారు. హైదరాబాద్ నగరవాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెట్రో విస్తరణ పనులు ఎప్పటి నుంచి పట్టాలెక్కనున్నాయనే అంశంపై ఈ భేటీ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Ajit Doval BRICS Security | కొత్త భద్రతా సవాళ్లపై అప్రమత్తంగా ఉండాలి : అజిత్ దోవల్