అక్షరటుడే, కామారెడ్డి: Rowdy Sheeter Rampage | కామారెడ్డి పట్టణంలోని బతుకమ్మ కుంట ప్రాంతంలో తల్వార్‌తో హంగామా సృష్టించిన రౌడీ షీటర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని పట్టణ సీఐ నరహరి మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
Rowdy Sheeter Rampage | కొంతకాలంగా విభేదాలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో బతుకమ్మ కుంట ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రౌడీ షీటర్‌గా ఉన్న సల్మాన్, హర్షద్‌ల మధ్య గోడకు సంబంధించిన వివాదం కారణంగా ఘర్షణ చోటుచేసుకుంది. ఇద్దరి మధ్య కొంతకాలంగా ఈ అంశంపై విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో సల్మాన్ తల్వార్‌తో బతుకమ్మ కుంట ప్రాంతంలో వీరంగం సృష్టించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అనంతరం బాధితుడు హర్షద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ నరహరి తెలిపారు.
నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.