Sanjay Jaju | తెలంగాణ కొత్త సీఎస్​గా సంజయ్ జాజు

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్​ సంజయ్ జాజును నియమించనున్నట్లు సమాచారం.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sanjay Jaju | తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్​ సంజయ్ జాజును నియమించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన కేంద్ర సర్వీస్​లో పని చేస్తున్నారు. రాష్ట్రానికి పంపాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.

ఈశాన్య ప్రాంతాల అభివృద్ది కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ జాజును కేంద్రం (Central Govt) మంగళవారం రిలీవ్ చేసింది. ప్రస్తుత సీఎస్​ రామకృష్ణారావు (CS Ramakrishna Rao) ఈ నెలాఖరున పదవి విరమణ చేయనున్నారు. దీంతో కొత్త సీఎస్​ నియామకంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని సీనియర్​ అధికారుల జాబితాను పరిశీలిస్తోంది. కొత్త సీఎస్​గా సంజయ్‌జాజుతో పాటు జయేశ్‌రంజన్‌ పేర్లను ప్రభుత్వం పరిశీలించినట్లు సమాచారం. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) జాజు వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

Sanjay Jaju | 1992 బ్యాచ్​

ias sanjay

సంజయ్​ జాజు 1992 బ్యాచ్‌ ఐఏఎస్ అధికారి. ఆయన విజయవాడ సబ్‌కలెక్టర్‌గా, పశ్చిమగోదావరి కలెక్టర్‌గా, హైదరాబాద్‌ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌గా, కమిషనర్‌గా, పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌గా గతంలో పని చేశారు. 2014 నుంచి కేంద్ర సర్వీస్​లోకి వెళ్లారు. తాజాగా మళ్లీ రాష్ట్రానికి రానున్నారు. దీంతో ఆయనను సీఎస్​గా నియమించనున్నట్లు తెలుస్తోంది. కాగా సంజయ్​ 2029 ఫిబ్రవరి వరకు సర్వీసులో ఉంటారు.

దీనిని కూడా చదవండి :  Delhi Fire Accident | ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *