అక్షరటుడే, ఇందూరు: Minister Seethakka Visit | పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఈ నెల 27న జిల్లాకు రానున్నారు. ఈ మేరకు నిజామాబాద్ (Nizamabad) మార్కెట్ కమిటీ (Market Committee) ఛైర్మన్ ముప్పగంగారెడ్డి వివరాలు వెల్లడించారు.
Minister Seethakka Visit | గాంధీ గంజ్.. శ్రద్ధానంద్ గంజ్‌లలో..
నగరంలోని మార్కెట్‌యార్డ్‌లో ఛైర్మన్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ.. శ్రద్ధానంద్ గంజ్, గాంధీగంజ్లలో(Gandhi Ganj) పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం నిమిత్తం ఈనెల 27న జిల్లాకు మంత్రి సీతక్క రానున్నారని చెప్పారు. ఈ సందర్భంగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో కొత్తగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించి, తగు ప్రతిపాదనలను వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు పంపేందుకు తీర్మానించామన్నారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ జంగిటి రాంచందర్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.