Police Duties | ప్రతి పోలీస్​ అధికారి నిక్కచ్చిగా విధులు నిర్వహించాలి..: సీపీ సాయిచైతన్య

పోలీస్ ఇమేజ్ పెంచే విధంగా ప్రతీ సిబ్బంది నికచ్చిగా విధులు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. కోటగిరి పోలీస్ స్టేషన్​ను గురువారం ఆయన సందర్శించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కోటగిరి : Police Duties | పోలీస్ ఇమేజ్ పెంచే విధంగా ప్రతీ సిబ్బంది నిక్కచ్చిగా విధులు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) సూచించారు. కోటగిరి(Kotagiri) పోలీస్ స్టేషన్​ను గురువారం ఆయన సందర్శించారు.

Police Duties | ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం..

సీపీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇచ్చారు. కోటగిరి పీఎస్ పరిధిలోని రికార్డ్​లను పరిశీలిస్తూ.. అండర్ ఇన్వెస్టిగేషన్​లో ఉన్న కేసుల వివరాలను తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల చేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన, ఇన్వెస్టిగేషన్ చేయాలని సబ్ ఇన్​స్పెక్టర్​కు సూచనలు చేశారు. ఈ పోలీస్ స్టేషన్ మహారాష్ట్రకు సరిహద్దులో ఉన్నందున వాహనాల రాకపోకలపై ఎల్లప్పుడూ నిఘా  ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రుద్రూర్ సీఐ శ్రీ కృష్ణ , కోటగిరి ఎస్సై శ్రీనివాస్ యాదవ్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Nizamabad CP Transfer

ఇది కూడా చదవండి: నా లైఫ్​లో కాస్లీయెస్ట్​ ఫిలిం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *