Nizamabad Excise Transfers | ఎక్సైజ్ అధికారుల బదిలీ.. నిజామాబాద్​ డీసీగా శ్రీధర్​

మంచిర్యాల జిల్లాలో విధులు నిర్వహించిన నందగోపాల్‌ను నిజామాబాద్‌కు బదిలీ చేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి స్థానంలో నందగోపాల్‌కు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nizamabad Excise Transfers | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఎక్సైజ్ శాఖలో పలువురు అధికారులను నియమిస్తూ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గురువారం అధికారిక ఆదేశాలు వెలువడ్డాయి.

Nizamabad Excise Transfers | సోమిరెడ్డికి ఖమ్మంలో పోస్టింగ్​

నిజామాబాద్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ (డీసీ)గా శ్రీధర్‌ను నియమించారు. ఇప్పటి వరకు నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తూ ఇన్‌ఛార్జి డీసీగా బాధ్యతలు నిర్వర్తించిన సోమిరెడ్డిని పదోన్నతిపై ఖమ్మం డీసీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న శ్రీధర్‌కు పదోన్నతి కల్పించి నిజామాబాద్‌కు బదిలీ చేశారు.

Hyderabad Water Crisis | ఐటీ హబ్‌ల తళతళల వెనుక ‘జల’ సంక్షోభం: భాగ్యనగరంలో పాతాళంలోకి భూగర్భ జలాలు!

ఇటీవల ఏసీబీకి చిక్కిన నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి స్థానంలో నందగోపాల్‌కు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మంచిర్యాల జిల్లాలో విధులు నిర్వహించిన నందగోపాల్‌ను నిజామాబాద్‌కు బదిలీ చేశారు.

tg

అలాగే నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్‌గా అరుణ్ కుమార్‌ను నియమించారు. వరంగల్ డిప్యూటీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ (డీపీఈవో)గా పనిచేసిన ఆయనకు పదోన్నతి కల్పించి అసిస్టెంట్ కమిషనర్‌గా నియమించారు.

నూతనంగా నియమితులైన అధికారులు గురువారం తమ బాధ్యతలు స్వీకరించినట్లు శాఖ వర్గాలు వెల్లడించాయి.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *