Srinath Reddy Death | బర్త్ డే పార్టీకి వెళ్లిన యువకుడి మృతి.. లండన్​లో ఘటన

స్నేహితుని వద్దకు బర్త్ డే పార్టీకి వెళ్లిన ఓ యువకుడు అతని గదిలోనే తెల్లారేసరికి విగతజీవిగా మారాడు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Srinath Reddy Death | స్నేహితుడి వద్దకు బర్త్ డే పార్టీకి వెళ్లిన ఓ యువకుడు అతని గదిలోనే తెల్లారేసరికి విగతజీవిగా మారాడు. ఈ ఘటన లండన్​లో రెండు రోజుల క్రితం చోటుచేసుకుంది.

Srinath Reddy Death | రాజంపేట మండలం..

రాజంపేట మండలం (Rajampet Mandal) తలమడ్ల గ్రామానికి చెందిన శ్రీనాథ్​ రెడ్డి(25) ఉన్నత చదువుల కోసం 14 నెలల క్రితం లండన్ వెళ్లాడు. ప్రస్తుతం లీసెస్టర్‌ పట్టణంలోని యూనివర్సిటీలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతున్న శ్రీనాథ్ రెడ్డి, మంగళవారం రాత్రి స్నేహితుడి బర్త్‌డే పార్టీకి వెళ్లాడు. అనంతరం అదే అతడి రూమ్‌లో నిద్రించాడు. ఉదయం స్నేహితుడు వచ్చి చూసేసరికి శ్రీనాథ్ రెడ్డి విగతజీవిగా కనిపించాడు. వెంటనే స్నేహితులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. తలమడ్ల గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి-మంజుల దంపతులు తమ కుమారుడు ఉన్నత చదువులు పూర్తిచేసుకుని మంచి ఉద్యోగం సాధిస్తాడని ఆశించారు. అయితే ఆ తల్లిదండ్రులకు అతని మరణం తీరని దుఃఖాన్ని మిగిల్చింది. శ్రీనాథ్ రెడ్డి మృతితో తలమడ్ల గ్రామంలో, కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ఇది కూడా చదవండి..: Police Duty Obstruction | తప్పతాగి పోలీసు విధులకు ఆటంకం.. నలుగురిపై కేసు నమోదు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *