అక్షరటుడే వెబ్‌డెస్క్: Fee Reimbursement | హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలపై ఎమ్మెల్సీ విజయశాంతి ( Vijaya Shanthi )కీలక వ్యాఖ్యలు చేశారు. ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు సంబంధించి కోర్టు ఆదేశాలను గౌరవిస్తూనే, విద్యార్థుల ప్రయోజనాల కోసం కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు.
Fee Reimbursement | యాజమాన్యాల బాధ్యత..
విద్యార్థుల నుంచి ఫీజులు తీసుకోవడంలో తప్పు లేదు, కానీ అందుకు తగ్గట్టుగా నాణ్యమైన విద్యను , సరైన వసతులను కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాలపైనే ఉందని విజయశాంతి స్పష్టం చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు.

Fee Reimbursement | విజిలెన్స్ నివేదిక ..
చాలా ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పాటించడం లేదని, కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదని విజిలెన్స్ కమిషన్ విచారణలో వెల్లడైందని ఆమె గుర్తుచేశారు. ఈ మేరకు విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వానికి నివేదికను కూడా సమర్పించిందని ఆమె తెలిపారు.
Fee Reimbursement | ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి..
ఫీజు రియింబర్స్‌మెంట్ పేరుతో ప్రభుత్వం చెల్లిస్తున్న ప్రజాధనానికి న్యాయం జరగాలని ఆమె కోరారు. నీస ప్రమాణాలు లేని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని తాను గతంలో శాసనమండలి సమావేశాల్లో కూడా ప్రస్తావించానని తెలిపారు. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, నాణ్యమైన విద్యను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Vi Spotify Partnership | వీఐ కస్టమర్లకు బంపర్ ఆఫర్..స్పాటిఫై ప్రీమియం ఇక ఉచితం