Kammarpally Police | మనస్తాపంతో ఒకరి ఆత్మహత్య

మూర్ఛ వ్యాధితో మనోవేదనకు గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కమ్మర్​పల్లి (Kammarpally) మండల పరిధిలోని గాంధీనగర్​లో చోటు చేసుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే,భీమ్​గల్(​కమ్మర్‌పల్లి): Kammarpally Police | మూర్ఛ వ్యాధితో మనోవేదనకు గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కమ్మర్​పల్లి (Kammarpally) మండల పరిధిలోని గాంధీనగర్​లో చోటు చేసుకుంది.

Kammarpally Police | నయం కాకపోవడంతో..

కమ్మర్‌పల్లి ఎస్సై సీహెచ్​ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్‌కు (Gandhinagar) చెందిన అశోక్ గత కొంతకాలంగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. వివిధ ఆస్పత్రుల్లో చూపించినా నయం కాకపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యేవాడు. దీంతో మద్యానికి బానిసయ్యాడు. ఆర్థిక ఇబ్బందులు సైతం చుట్టుముట్టాయి. రెండు నెలలుగా ఎలాంటి పనికి వెళ్లకుండా రోజంతా మద్యం తాగుతుండటంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన అశోక్.. శుక్రవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు బయట నిద్రిస్తున్న సమయంలో గదిలోకి వెళ్లి చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఉదయం 6:20 గంటల ప్రాంతంలో భార్య సంధ్య లోపలికి వెళ్లి చూసేసరికి అశోక్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని కిందకు దించినప్పటికీ అప్పటికే మృతి చెందాడు. మృతుడి భార్య సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమ్మర్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Yellareddy Police |

ఇది కూడా చదవండి: కదులుతున్న వ్యాన్​లో నుంచి పడిపోయిన విద్యార్థులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *