Ponnam Prabhakar on SIR | ఒక్క ఓటు కూడా పోవద్దు.. ఎస్​ఐఆర్​పై మంత్రి పొన్నం

ఎస్​ఐఆర్​ ప్రక్రియలో భాగంగా అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా పోకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ponnam Prabhakar on SIR | ఎస్​ఐఆర్​ ప్రక్రియలో భాగంగా అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా పోకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. బీఎల్​వోలు ఇచ్చే ఎన్యుమరేషన్​ ఫారాలను ప్రతి ఒక్కరు నింపాలని సూచించారు.

మంత్రి పొన్నం (Minister Ponnam) సోమవారం హుస్నాబాద్​ నియోజకవర్గం కోహెడ మండల కేంద్రంలో పర్యటించారు. కాంగ్రెస్​ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఎస్​ఐఆర్​ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఎల్​వోలు ఇచ్చే ఎన్యుమరేషన్​ ఫారాలు నింపి, ఓటరు జాబితాలో ఓటు గల్లంతు కాకుండా చూసుకోవాలన్నారు. బీఎల్​వోలు, బీఎల్​ఏలు ఓటరు సవరణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఫారాలను ఎలా నింపాలో వివరించాలన్నారు. అర్హులు తమ ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని సూచించారు.

Ponnam Prabhakar on SIR | సంక్షేమ పథకాల అమలు

Ponnam Prabhakar on SIR

రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. హుస్నాబాద్​లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. మొదటి దశలో 3500 ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయన్నారు. అర్హత ఉన్న వారికి ఇళ్లు ఇస్తున్నట్లు తెలిపారు. కాలువల్లో భూమి పోయిన ప్రభుత్వానికి సహకరించాలని రైతులను కోరారు. ఈ ప్రాంతం సస్యశ్యామలం చేస్తామని పొన్నం ప్రభాకర్​ హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.

ఇది కూడా చదవండి..: Ponnam Prabhakar | రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొన్నం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *