Voter List Discrepancy | ఓట్ల తొలగింపులో పక్షపాతం.. కొడంగల్​లో 33 వేలకు పైగా నకిలీ​ ఓట్లు ఉన్నా పట్టించుకోరే : కల్వకుంట్ల కవిత ఘాటు విమర్శ

Naresh Chandan

అక్షరటుడే, ఇందూరు: Voter List Discrepancy | కొడంగల్, బోధన్ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా నుంచి ఓట్ల తొలగింపు విషయంలో కనిపిస్తున్న వ్యత్యాసంపై ఎన్నికల సంఘం ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) డిమాండ్ చేశారు.

Voter List Discrepancy | దాదాపు 7 వేల ఓట్లు తొలగించడం

సోమవారం నిర్వహించిన సమావేశంలో కవిత మాట్లాడుతూ.. ఒక ఎన్నికల ఫలితాన్నే ప్రభావితం చేసే స్థాయిలో 33,433 వేల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న కొడంగల్ నియోజకవర్గంలో గత సంవత్సన్నర కాలంలో కేవలం 808 ఓట్లు మాత్రమే తొలగించారని పేర్కొన్నారు. అదే సమయంలో బోధన్ నియోజకవర్గంలో మాత్రం దాదాపు 7 వేల ఓట్లు తొలగించడం అనేక అనుమానాలకు తావిస్తోందని అన్నారు.

కర్ణాటకలోని సేడంలోని 11 వేల ఓట్లు కొడంగల్​లోని 11 వేల ఓటర్ల పేర్లను పోలి ఉన్నాయని తెలిపారు. మరో 22 వేల ఓట్లు కొడంగల్​లోనే డూప్లికేట్​ ఉన్నట్లు చెప్పారు. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్​ ఆధిత్యం తెచ్చుకున్న ఓట్లు 32 వేలని, అంటే ఒక ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేంత స్థాయిలో కొడంగల్​లో డూప్లికేట్​ ఓట్లు ఉన్నట్లు వివరించారు.

Voter List Discrepancy

ఈ వ్యత్యాసం వెనుక కారణాలను ఎన్నికల సంఘం స్పష్టంగా వెల్లడించాలని కవిత కోరారు. ఎన్నికల సంఘం ముఖ్యమంత్రికి అనుకూలంగా వ్యవహరిస్తోందా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు.

ఈ అంశంపై ఎన్నికల సంఘం స్పందించి, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, తొలగించిన ఓట్ల వివరాలు, వాటికి సంబంధించిన కారణాలను పారదర్శకంగా ప్రజల ముందుంచాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి..: Armoor SIT Probe | ఆర్మూర్​లో వరుస ఘటనలపై ‘సిట్’ వేసి విచారణ జరపాలి

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *