Nizamabad Rural Police | వ్యభిచార గృహంపై పోలీసుల మెరుపుదాడి

నిజామాబాద్ నగరంలోని రూరల్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో వ్యభిచార గృహంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Rural Police | నగరంలోని (Nizamabad) రూరల్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో వ్యభిచార గృహంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

Nizamabad Rural Police | హౌసింగ్​ బోర్డు కాలనీలో..

నిజామాబాద్​ రూరల్​ ఎస్​హెచ్​వో శ్రీనివాస్​ తెలిపిన వివరాల ప్రకారం.. రూరల్ పీఎస్​ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందనే పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఓ మహిళ, పురుషుడిని సైతం పట్టుకున్నారు. విచారణలో నిందితులు నాలుగు నెలలుగా అద్దె ఇంట్లో రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు, హైదరాబాద్‌కు చెందిన బ్రోకర్ ద్వారా మహిళలను ఇక్కడికి రప్పిస్తున్నట్లు తేలింది.

ఈ కేసులో ప్రధాన నిందితులు ఇద్దరితో పాటు విటుడిని అరెస్టు చేయగా, బాధిత మహిళను రక్షించి (Human Trafficking) సంబంధిత నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టారు. బాధిత మహిళను న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చడం జరిగిందన్నారు. హైదరాబాద్‌కు చెందిన బ్రోకర్ ప్రస్తుతం పరారీలో ఉండగా, ఆమె కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్​హెచ్​వో వివరించారు. వ్యభిచార గృహం నిర్వాహకులపై గతంలో నగరంలోని ఐదో టౌన్​లో కూడా వ్యభిచారానికి సంబంధించిన కేసు నమోదైనట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఈ మేరకు నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Police Prajavani |

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *