Nizamabad Council Meeting | వాడీవేడిగా కౌన్సిల్ ​సమావేశం.. సమస్యలపై కార్పొరేటర్ల నిలదీత

నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్​ కార్యాలయంలో మంగళవారం మేయర్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు

shashi kiran Mottala

అక్షర టుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad Council Meeting | నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్​ (Municipal Corporation) కార్యాలయంలో మంగళవారం మేయర్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అయితే డివిజన్లలో సమస్యలపై కార్పొరేటర్లు ధ్వజమెత్తారు.

Nizamabad Council Meeting | తాగునీరు అందక అవస్థలు

కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు విఫలం అయ్యారని కార్పొరేటర్లు ఆరోపించారు. ముఖ్యంగా శివారు కాలనీల్లో తాగునీరు అందడం లేదని.. చిన్నపాటి వర్షానికి డ్రైనేజీలు పూర్తిగా నిండిపోయి రోడ్ల మీదికి మురికి నీరు వస్తోందని ఆరోపించారు. డివిజన్లలోని కాలనీలో స్ట్రీట్ లైట్లు వెలగకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు.

Nizamabad Council Meeting

సంబంధిత అధికారులకు సమాచారం అందించినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆరోపించారు. వర్షాకాలం నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన వీటిని సరిచేయాలని డిమాండ్ చేశారు. మేయర్​ మాట్లాడుతూ.. 90 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతి డివిజన్​లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. కార్పొరేటర్లు లేవనెత్తిన సమస్యలను ప్రణాళికతో పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్​ అఫీషియో మెంబర్లు ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Bheemgal Palle Davakhana | పల్లె దవాఖానకు జాగా కరువు.. నిధులున్నా నిర్మాణానికి నోచుకోని వైనం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *