అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jupally Resignation Challenge | మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ఈరోజు తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. కేటీఆర్, హరీశ్‌రావు వస్తానంటే సాయంత్రం 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు వస్తానని తెలిపారు.
బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై గురువారం చర్చకు వస్తానని జూపల్లి కృష్ణారావు సవాల్ చేసిన విషయం తెలిసిందే. అయితే చర్చకు వెళ్తున్న మాజీ మంత్రి హరీశ్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో హరీశ్‌రావు మాట్లాడుతూ జూపల్లిపై తీవ్ర విమర్శలు చేశారు. సవాల్ విసిరి తోక ముడిచారన్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సీఎల్పీ కార్యాలయంలో జూపల్లి మాట్లాడారు.
Jupally Resignation Challenge | నా మాటలకు కట్టుబడి ఉన్న
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని అప్పుల గురించి తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. ఆ అప్పుల గురించి అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్, హరీశ్‌రావు మాట్లాడారన్నారు. తాను పారిపోయే వ్యక్తిని కాదని, తాను చెప్పిన లెక్కలు తప్పయితే.. తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
Jupally Resignation Challenge | కేసీఆర్‌తో చెప్పించాలి
పోలీసులు హరీష్ రావును ఎందుకు అరెస్ట్ చేసారో తనకు తెలియదని జూపల్లి తెలిపారు. హరీష్ రావు గన్ పార్క్ వద్దకు వస్తున్న అనడంతో తాను అక్కడకు వెళ్లానని చెప్పారు. అప్పుల విషయంలో తన లెక్కలు తప్పని కేసీఆర్‌తో చెప్పించాలని, కాళేశ్వరం కార్పొరేషన్, మిషన్ భగీరథ అప్పులపై సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. కార్పొరేషన్ల పేరిట తెచ్చిన అప్పులను తాము తీసుకు రాలేదని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారని జూపల్లి అన్నారు. మరీ బీఆర్ఎస్ హయాంలో వాటికి ప్రభుత్వ ఖజానా నుంచి వడ్డీలు ఎందుకు కట్టారని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి మరోసారి సవాల్
బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి మరోసారి సవాల్ విసిరారు. ఈరోజు కూడా నేను చర్చకు సిద్ధమని ప్రకటించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉంటానని వెల్లడించారు. సాయంత్రం 5 గంటలకు ప్రెస్ క్లబ్లో చర్చిద్దామని చెప్పారు.
Jupally Krishna Rao once… pic.twitter.com/8yreFTLVmV
— Akshara Today | Telugu News (@aksharatoday) July 3, 2026
దీనిని కూడా చదవండి : DSP Bheem Reddy ACB | డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డిపై ఏసీబీ పంజా: భారీగా అక్రమాస్తుల గుర్తింపు