Scanning Centre Fraud | స్కానింగ్​ సెంటర్​లో రూ.లక్షలు కాజేసిన ఉద్యోగులు.. ఒకరి అరెస్ట్​

స్కానింగ్​ సెంటర్​ యజమానిని మోసం చేసిన ఉద్యోగులు రూ.లక్షల్లో లూటీ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Scanning Centre Fraud | స్కానింగ్​ సెంటర్​ యజమానిని మోసం చేసిన ఉద్యోగులు రూ.లక్షల్లో లూటీ చేశారు. ఈ ఘటన నిజామాబాద్(Nizamabad)​ నగరంలో చోటు చేసుకోగా.. వన్​ టౌన్​ పోలీసులు(Nizamabad Police) కేసు నమోదు చేశారు. ఎస్​హెచ్​వో రఘుపతి వివరాలు వెల్లడించారు.

Scanning Centre Fraud | రూ.70 లక్షలు మాయం

జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కానింగ్ కేంద్రంలో(Scanning Centre) ఇద్దరు ఉద్యోగులు గుండారం సత్యనారాయణ, మీనా కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు అయితే వారు నకిలీ నగదు రసీదులు తయారు చేసి, సంస్థ యాజమాన్యాన్ని మోసం చేసి రూ.70 లక్షలకు కాజేశారు. 2009నుం ఈ స్కానింగ్​ సెంటర్​ పనిచేస్తోంది. ఈ కేంద్రంలో సూపర్ వైజర్​గా పనిచేస్తున్న గుండారం సత్యనారాయణ, టి.మీనాలు కలిసి పథకం ప్రకారం సంస్థను మోసం చేశారు. రోగులకు ఇచ్చే అసలు నగదు రసీదుల్లో కార్బన్ పేపరు తొలగించి, అనంతరం అదే బిల్లు నంబర్ పరీక్షల వివరాల మొత్తాలను తక్కువగా చూపిస్తూ నకిలీ రికార్డులు తయారు చేశారు. రోగులకు అసలు మొత్తంతో కూడిన రసీదు ఇచ్చిన తర్వాత, కార్యాలయ రికార్డుల్లో మాత్రం పరీక్షల వివరాలు, ఫీజులను మార్చి నమోదు చేయడం ద్వారా రోజువారీ నగదును దుర్వినియోగం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Scanning Centre Fraud | ఆరేళ్లుగా స్కానింగ్​ సెంటర్​లో అక్రమాలు..

ఈ విధానం సుమారు ఆరేళ్లుగా కొనసాగిందని, ఈ కాలంలో రూ.70 లక్షలకు పైగా సంస్థకు నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ అక్రమాల గురించి ఇతర ఉద్యోగులు వెల్లడించకుండా వారిని బెదిరించడం, కొన్ని ఆధారాలను మాయం చేయడానికి ప్రయత్నించినట్లు పోలీసులు సమాచారం సేకరించారు. ఇందుకు సంబంధించి 2025 జనవరి నుంచి జూలై వరకు ఉన్న కొన్ని నగదు రసీదుల ప్రతులను పోలీసులకు సమర్పించినట్లు ఫిర్యాదులో వివరించారన్నారు. ఈ సందర్భంగా సెంటర్​లో పనిచేసిన ఇద్దరు ఉద్యోగులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​హెచ్​వో తెలిపారు. అక్రమంగా యజమానికి టోకరా వేసిన డబ్బులతో గుండారం సత్యనారాయణ తన భార్య పేరిట భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు విచారణలో వెళ్లడైందన్నారు. ఇందులో భాగంగా గుండారం సత్యనారాయణను అరెస్ట్​ చేశామని.. మరో ఇద్దరు మహిళలు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *