Steel Bank Bheemgal | భీమ్​గల్​లో ‘స్టీల్​ బ్యాంక్​’ ప్రారంభం.. ప్లాస్టిక్ రహిత మండలం​ దిశగా ముందడుగు

భీమ్​గల్​లో శ్రీ వైష్ణవి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'స్టీల్ బ్యాంక్'ను మున్సిపల్ ఛైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి మంగళవారం ప్రారంభించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్​గల్: Steel Bank Bheemgal | భీమ్​గల్​ను ప్లాస్టిక్​రహిత మండలం దిశగా తీర్చిదిద్దేందుకు ముందడుగు పడింది. ప్లాస్టిక్ రహిత పట్టణ నిర్మాణమే లక్ష్యంగా భీంగల్ (Bheemgal) పురపాలక సంఘం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Steel Bank Bheemgal | స్టీల్​ బ్యాంక్​ ప్రారంభించిన ఛైర్​పర్సన్​

పట్టణంలోని 9వ వార్డులో శ్రీ వైష్ణవి మహిళా సంఘం ఆధ్వర్యంలో ‘ఇందిర మహిళా శక్తి’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ‘స్టీల్ బ్యాంక్’ను మున్సిపల్ ఛైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి మంగళవారం ప్రారంభించారు.  ఛైర్‌పర్సన్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి ఎంతో ప్రమాదకరమని, దీనిని నివారించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్ల స్థానంలో స్టీల్ పాత్రలను వాడటం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని.. ఇందిర మహిళా శక్తి ద్వారా అందుబాటులోకి తెచ్చిన ఈ స్టీల్ బ్యాంక్‌ను ప్రజలు తమ ఇంట్లో జరిగే శుభకార్యాలు, ఇతర వేడుకలకు వినియోగించుకోవాలని సూచించారు.

Steel Bank Bheemgal | ప్లాస్టిక్​ రహిత సమాజం కోసం

Steel Bank Bheemgal

ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఛైర్​పర్సన్​ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ చంటి లత నర్సయ్య, మున్సిపల్ కమిషనర్ గజానంద్, కౌన్సిలర్లు ఆరేపల్లి శ్రీజ నాగేంద్రబాబు, పర్స కుశలత అనంతరావు, తోట సతీష్, గున్నాల బాలలక్ష్మీ భగత్, బోదిరే లావణ్య నర్సయ్య, అంజుమ్ ఆలీ, సందీప్, నీలం రవి, సంగ్యా నాయక్, మల్లెల అనుపమ ప్రసాద్, మేనేజర్ నరేందర్, ఏడీఎంసీ నందన్ రెడ్డి, మెప్మా సిబ్బంది, పురపాలక అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇందిర మహిళా శక్తి సభ్యులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Medical Workers Salaries | జీజీహెచ్​, మెడికల్​ కళాశాలలో కార్మికులకు వేతనాలు పెంచాలని ధర్నా

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *