US Iran Tensions | ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది: ట్రంప్

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా , ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: US Iran Tensions | పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా , ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తుర్కియేలో జరుగుతున్న నాటో (NATO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ఆయన, ఇరాన్‌తో ఇప్పటివరకు కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని స్పష్టం చేశారు.

US Iran Tensions | తీవ్రస్థాయిలో వైమానిక దాడులు..

ఇరాన్‌తో చర్చలు జరపడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, అది సమయం వృథా మాత్రమేనని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇటీవల హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ జరిపిన దాడులే ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణం. ఇరాన్ దుశ్చర్యకు ప్రతిగా, ఆ దేశ వైమానిక రక్షణ వ్యవస్థలు , తీరప్రాంత నిఘా కేంద్రాలపై అమెరికా దళాలు తీవ్రస్థాయిలో వైమానిక దాడులు చేశాయి.
trump.9

US Iran Tensions | ప్రతీకారంతో భగ్గుమన్న గల్ఫ్..

అమెరికా దాడులపై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తీవ్రంగా స్పందించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఆరోపిస్తూ, బహ్రెయిన్ , కువైట్‌లోని 85 అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో విరుచుకుపడింది. ఈ పరస్పర దాడులతో ఆయా గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. భద్రతా సిబ్బంది , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ సైరన్లు మోగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన గల్ఫ్ ప్రాంతంలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇది కూడా చదవండి:  Corporation Chairman Posts | ‘కార్పొరేషన్’ దక్కేదెవరికో.. నాలుగు కార్పొరేషన్లకు ముగిసిన పదవీకాలం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *