అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Shamshabad Bolero Accident | రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) శంషాబాద్‌లో బొలెరో వాహనం బీభత్సం సృష్టించింది. బస్సు కోసం నిరీక్షిస్తున్న మహిళలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
Shamshabad Bolero Accident | స్కిడ్ కావడంతో
శంషాబాద్ సత్తంరాయి వద్ద బస్టాండ్‌లో ఎదురు చూస్తున్న మహిళలపైకి మిర్చి లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం గురువారం ఉదయం దూసుకెళ్లింది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయడానికి యత్నించగా.. వాహనం స్కిడ్ కావడంతో మహిళలను ఢీకొంది. దీంతో వాహనం కింద పడి సుమ, సువర్ణ అనే మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్ జామ్ కాగా.. క్లియర్ చేశారు.
ఇది కూడా చదవండి..: Telangana Heavy Rains | రైతులకు గుడ్‌న్యూస్.. నేడు భారీ వర్షాలు