అక్షరటుడే, కామారెడ్డి: Mla KVR | పట్టణంలోని జీఆర్ కాలనీ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన త్రినేత్ర టీ పాయింట్‌ను కామారెడ్డి (Kamareddy) ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (KVR MLA) ప్రారంభించారు. ప్రముఖ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి పీఏ మామిండ్ల రాజు ఈ టీ పాయింట్‌ను ఏర్పాటు చేశారు.
Mla KVR | ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని..
గురువారం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. తన టీ పాయింట్లో పాల ప్యాకెట్లతో కాకుండా న్యాచురల్ పాలతో టీ తయారు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు రుచికరమైన నాణ్యమైన టీ అందిస్తామని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాల ప్యాకెట్ల ద్వారా టీ తయారీకి స్వస్తి పలుకుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ‘2036లో భారతదేశం ఒలంపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది.