Police Duty Meet | విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం అవసరం : సీపీ సాయిచైతన్య

విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం అవసరమని సీపీ సాయిచైతన్య అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Police Duty Meet | విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం అవసరమని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) అన్నారు. జోన్–2 బాసర లెవల్ పోలీస్ డ్యూటీ మీట్ -2026ను గురువారం ఆయన ప్రారంభించారు.

Police Duty Meet | విధి నిర్వహణలో సామర్థ్యం పెంచేందుకు..

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీసుల విధినిర్వహణలో సామర్థ్యం పెంచడానికి రాష్ట్రంలో మూడో పోలీస్ డ్యూటీ మీట్​ను నిజామాబాద్​లో ప్రారంభిస్తున్నామన్నారు. నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్, అదిలాబాద్ జిల్లాల పోలీసు అధికారులకు మీట్​లో భాగంగా పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పోటీల ద్వారా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ స్థాయి నుండి సీఐ స్థాయి వరకు పని పద్ధతులు మెరుగుపడి ఇన్వేస్టిగేషన్ స్థాయిలు పెరుగుతాయన్నారు. పనిలో పోటీతత్వం అలవాటుపడుతుందన్నారు. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్​, ఫింగర్ ప్రింట్ ఇన్వెస్టిగేషన్ కోసం ఎంపికలో భాగంగా గురువారం ‘పోలీస్​ క్లూస్​’ ఏ విధంగా సేకరించాలనే దానిపై పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. డ్యూటీ మీట్​లో భాగంగా రెండు రోజుల పాటు పోటీలు జరుగుతాయని సీపీ పేర్కొన్నారు.

Police Duty Meet | మారుతున్న కాలానుగుణంగా..

మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలను సైన్స్ ఇన్వెస్టిగేషన్ టూల్​గా మార్చుకోవడం కోసం తమను తాము మెరుగుపర్చుకోవాలని సీపీ సూచించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చేందుకు ఈ పోటీలు ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్, ఏసీపీలు ప్రకాష్ యాదవ్, సీటీసీ రాజశేఖర్, సీసీఎస్​ శ్రీశైలం, సీసీఆర్​బీ గురు నాయుడు, టాస్క్​ఫోర్స్​ నరేందర్, డాక్టర్ నాగేంద్రబాబు, జగిత్యాల్, నిజామాబాద్, నిర్మల్, అదిలాబాద్ సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.Police Duty Meet

ఇది కూడా చదవండి..: Temple Development | దేవాలయాల పరిరక్షణకు ప్రాధాన్యం : ఎమ్మెల్యే భూపతిరెడ్డి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *