Revanth Reddy| మనవడి కోసం పూరీలు వేసిన సీఎం రేవంత్.. వీడియో వైరల్

రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనవడి కోసం స్వయంగా పూరీలు వండి, ఆ మధుర క్షణాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Reddy | రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనవడి కోసం స్వయంగా పూరీలు వండి, ఆ మధుర క్షణాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

Revanth Reddy | మనవడి కోరిక..

“తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా” అని మనవడు అడగడంతో, ముఖ్యమంత్రి మనవడి కోరికను కాదనలేక, తనే పూరీలు వేశారు. “పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, గుండ్రంగా లేని డజన్ పూరీలు.. బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు” అని రేవంత్ రెడ్డి రాసుకొచ్చారు.

puri.1

Revanth Reddy | వైరల్ అవుతున్న వీడియో..

ఈ సందర్భంగా తీసిన వీడియోలో ముఖ్యమంత్రి చాలా ఉత్సాహంగా, మనవడితో కలిసి పూరీలు వేయడం కనిపిస్తుంది. రాజకీయ నాయకుడిగా బిజీగా గడిపినా, ఇంట్లో ఒక తాతగా చేసిన పనులకు నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. కష్టతరమైన రాజకీయ పనుల మధ్య కూడా కుటుంబానికి సమయం కేటాయించడం పట్ల పలువురు నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు.


ఇది కూడా చదవండి:  Bhageerath Bail | హైకోర్టు కీలక తీర్పు.. బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *