అక్షరటుడే, బాన్సువాడ: Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన అధికారులు, సిబ్బందిపై కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సీరియస్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో బాన్సువాడ మండల పంచాయతీ అధికారి (ఎంపీవో)పై వేటు వేశారు.
Indiramma Houses | ఇళ్ల నిర్మాణ పురోగతిపై..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని సక్రమంగా పర్యవేక్షించడంలో ఎంపీవో నాగరాజు విఫలమైనట్లు అధికారుల పరిశీలనలో తేలిందని సమాచారం. అలాగే పైఅధికారుల ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందున ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) ఆదేశాల మేరకు ఎంపీవో నాగరాజును హైదరాబాద్‌లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి సరెండర్ చేసినట్లు బాన్సువాడ ఎంపీడీవో ఆనంద్ తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.

ఇది కూడా చదవండి..: Banswada Student Suicide | విద్యార్థిని ఆత్మహత్య ఘటన.. వార్డెన్ సస్పెన్షన్