అక్షరటుడే, కామారెడ్డి: DPRO Surrender | కామారెడ్డి(Kamareddy) డీపీఆర్వో(DPRO) తిరుమలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) ఐఅండ్ పీఆర్ కమిషనరేట్‌కు సరెండర్ చేశారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీలో నిర్లక్ష్యం వహించడంతో పాటు వారిపట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
DPRO Surrender | అక్రెడిటేషన్ కార్డు జాబితాలో..
గత కొంత కాలంగా డీపీఆర్వోకు, జర్నలిస్టులకు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. అక్రిడిటేషన్ కమిటీ ఫైనల్ చేసిన జాబితా ప్రకారం కార్డులు జారీ చేయడంలో డీపీఆర్వో (Information Department)నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై జర్నలిస్టులు అసంతృప్తితో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల సమయంలో డీపీఆర్వో తీరును నిరసిస్తూ జర్నలిస్టులు ధర్నా కూడా చేపట్టారు. ఇటీవల అక్రెడిటేషన్ కార్డుల జారీ అంశంపై జర్నలిస్టులు, అక్రెడిటేషన్ కమిటీ సభ్యులు కలెక్టర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినా ఆమె తీరులో మార్పు రాకపోవడంతో బదిలీ చేయాలని లేదా సొంతశాఖకు సరెండర్ చేయాలని జర్నలిస్టులు పట్టుబట్టారు. దీంతో కలెక్టర్ చర్యలు తీసుకుని ఆమెను కమిషనరేట్ కు సరెండర్ చేశారు. ప్రస్తుతం ఇన్‌ఛార్జి డీపీఆర్వోగా అడిషనల్ కలెక్టర్ గిరికి బాధ్యతలు అప్పగించారు.
ఇది కూడా చదవండి: రెండేళ్లలో 71 వేల ఉద్యోగాలు ఇచ్చాం: పొంగులేటి