అక్షరటుడే వెబ్డెస్క్: Bhatti Vikramarka | రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన ‘మెగా రైతు మేళా’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు, మహిళా సంఘాల కోసం ప్రభుత్వం చేపట్టిన పథకాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
Bhatti Vikramarka | చేతల్లో చూపిస్తున్నాం..
“గత ప్రభుత్వం రైతుబంధు నిధులు జమ చేసేందుకు సుమారు 160 రోజులు సమయం తీసుకునేది. కానీ, మా ప్రభుత్వం రైతు భరోసా కింద కేవలం 9 రోజుల్లోనే రూ.9,000 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసింది. మాటలతో కాకుండా, చేతలతో రైతు సంక్షేమాన్ని నిరూపిస్తున్నాం” అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సాగునీరు, ధాన్యం కొనుగోలు, వ్యవసాయ యాంత్రీకరణ వంటి రంగాలకు వేల కోట్లు వెచ్చిస్తున్నామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యమని ఆయన వివరించారు.
Bhatti Vikramarka | మహిళా సాధికారతకు పెద్దపీట..
మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని డిప్యూటీ సీఎం తెలిపారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన డ్వాక్రా మహిళల వడ్డీలేని రుణాలను కూడా తాము అందిస్తున్నామని వెల్లడించారు. తమ ప్రభుత్వం మహిళలకు రూ.లక్ష కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే రూ.67 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందజేశాము. మహిళలకు ఇచ్చే రుణ పరిమితిని రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచాము. రైతులే దేశానికి వెన్నెముక అని, ఆ వెన్నెముకను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. దశాబ్దాల క్రితం కాంగ్రెస్ నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులే నేటికీ రైతులకు జీవనాధారంగా నిలుస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.
ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, 9 రోజుల్లో రూ.9వేల కోట్ల రైతు భరోసా నిధులు జమ చేశామని గత ప్రభుత్వంతో పోలిస్తే వేగంగా, ఎక్కువ సాయం అందిస్తున్నామన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ఇప్పటికే రూ.67 వేల కోట్ల… pic.twitter.com/vUSFSSw3vi
— TG Govt Updates (@TGGovtUpdates) July 10, 2026
ఇది కూడా చదవండి: Oil Palm Cultivation | ఆయిల్ పామ్ సాగు చేసే గ్రామాలకు ప్రోత్సాహకం