అక్షరటుడే, కామారెడ్డి: Cobra in Scooter | ఇంటినుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి స్కూటీలో నాగుపాము ప్రత్యక్షమైంది. ఈ సంఘటన కామారెడ్డి (Kamareddy) పట్టణంలో శనివారం చోటుచేసుకుంది.
Cobra in Scooter | టేక్రియాల్ గ్రామానికి చెందిన..
మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్ గ్రామానికి చెందిన చౌకి కోటేశ్వర్ తన స్కూటీపై కామారెడ్డికి బయకుదేరాడు. హెడ్లైట్ ముందు భాగంలో వింత శబ్దం రావడంతో ఇంటర్నేషనల్ హోటల్ సమీపంలో స్కూటీ ఆపి చూడగా నాగుపాము కనిపించింది. భయాందోళనకు గురైన కోటేశ్వర్ స్కూటీని రోడ్డు పక్కన ఆపివేసి స్నేహితులకు, మెకానిక్ సమాచారం ఇచ్చాడు. మెకానిక్ సాయంతో స్కూటీ ముందు భాగం ఓపెన్ చేసి నాగుపామును బయటకు పంపించేశారు. నాగుపాము స్కూటీ నుంచి బయటకు వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు. రోజు మాదిరిగానే స్కూటీని ఇంటిముందు పార్కింగ్ చేసినట్లు కోటేశ్వర్ తెలిపారు.

ఇది కూడా చదవండి..: Telangana University Recruitment | తెయూలో నియామక ప్రక్రియ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి