Congress SIR Plan | ‘సర్’​ పర్యవేక్షణకు కాంగ్రెస్ ప్రణాళిక.. పర్యవేక్షకులు, అసెంబ్లీ కోఆర్డినేటర్ల నియామకం

ఎస్​ఐఆర్​ ప్రక్రియలో వేగం పెంచేందుకు కాంగ్రెస్​ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. తమ ఓట్లు గల్లంతు కాకుండా ఉండేందుకు కార్యాచరణతో ముందుకు వెళ్తోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Congress SIR Plan | ఎస్​ఐఆర్​ ప్రక్రియలో వేగం పెంచేందుకు కాంగ్రెస్​ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. తమ ఓట్లు గల్లంతు కాకుండా ఉండేందుకు కార్యాచరణతో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ఆయా డివిజన్లలో ముఖ్య నాయకులు ప్రచారం నిర్వహించగా తాజాగా నగరంలో పర్యవేక్షకులు, అసెంబ్లీ కోఆర్డినేటర్లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Congress SIR Plan | డీసీసీ కార్పొరేషన్​ ఆధ్వర్యంలో..

నిజామాబాద్​ (Nizamabad) డీసీసీ కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో 60డివిజన్లకు పర్యవేక్షకలును, అసెంబ్లీ కోఆర్డినేటర్లను నియమించారు. జిల్లాలోని సీనియర్​ నాయకులను సంప్రదించి వారి పర్యవేక్షణలో ఎస్​ఐఆర్​ ప్రక్రియను నిర్వహించాలని నిర్ణయించారు. ఆయా డివిజన్లలో సీనియర్ నాయకుల పర్యవేక్షణలో ‘సర్​’ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. పర్యవేక్షకుడు గడుగు గంగాధర్​కు శివచరణ్​, మహమ్మద్​ వహీద్​, బంటు బలరాం సూపర్​వైజర్లుగా వ్యవహరించనున్నారు. అలాగే తాహెర్​ బిన్​ హందాన్​కు ముస్తఫా అల్కాఫ్​, సయ్యద్​ హర్షద్​, ఎండీ జియా అహ్మద్​ సూపర్​వైజర్లుగా ఉంటారు. కేశ వేణుకు ఆకుల శ్రీశైలం, అంతరెడ్డి విజయ్​పాల్​, అపర్ణపాటిల్​ కోఆర్డినేటర్లుగా ఉంటారు. ఎం శేఖర్​ గౌడ్​కు సకినాల శివకుమార్​, సర్దార్​ నరేందర్​ సింగ్​ కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారు.

Congress SIR Plan | డాక్టర్​ కవితా రెడ్డి..

Congress SIR Plan

అలాగే పర్యవేక్షకురాలు కవితారెడ్డికి ఆకుల వెంకటేష్​(రాజు), జిల్లెల రమేష్​​ కోఆర్డినేటర్లుగా ఉంటారు. రామ్​భూపాల్​కు​ మల్యాల గోవర్ధన్, లావణ్య, ఆరుణ్​కుమార్​ ఉంటారు. జీవీ రామకృష్ణకు ధర్మారం అవిన్​, పత్తి శోభన్​ కుమార్​, కోఆర్డినేటర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. నరాల రత్నాకర్​కు సయ్యద్​ నవాజ్​, ఇమ్రాన్​ అహ్మద్​, సయ్యద్​ స​లీంలు అసెంబ్లీ కోఆర్డినేటర్లుగా వ్యవహరించనున్నారు. ఎండీ జావిద్​ అక్రంకు సాయి బసవ మాదివర్​, ఎండీ యూనుస్​(ఖుద్దుస్​), ఒబిద్​ బిన్​ హందాన్​ ఉంటారు. కప్​కర్​ గణ్​రాజ్​ గోపరి లక్ష్మణ్​, బొబ్బిలి మురళి, బండారి రమేష్​లు బాధ్యతలు చూస్తారు.

ఇది కూడా చదవండి..: Bheemgal Oora Panduga | భీమ్​గల్​లో వైభవంగా ‘ఊర పండుగ’

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *