SIR Form Campaign | ఎస్​ఐఆర్​ ఫామ్​ ఇవ్వండి.. బహుమతి గెలవండి

ఎస్ఐఆర్​ ప్రక్రియను వేగవంతం చేసేందుకు బీజేపీ కార్పొరేటర్​ లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. ఫామ్​ నింపి ఇచ్చిన వారి పేర్లతో లక్కీ డ్రా నిర్వహించి బహుమతులు అందిస్తామని ప్రకటించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : SIR Form Campaign | జిల్లాలో ఎస్​ఐఆర్​ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. దీంతో అధికారులు ఇప్పటికే ఆయా డివిజన్ల
ఎస్​ఐఆర్​ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే బీజేపీ (BJP) సైతం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. నగరంలోని 22వ డివిజన్​లో ఎస్​ఐఆర్​ను వేగవంతం చేసేందుకు కార్పొరేటర్​ వినూత్నంగా ప్రయత్నాలు ప్రారంభించారు.

SIR Form Campaign | ప్రజలకు అవగాహన కల్పించేందుకు..

SIR Form Campaign

ఈ సందర్భంగా 22వ డివిజన్​లో ఓటర్లను చైతన్యపర్చేందుకు వినూత్నంగా ఆలోచించారు కార్పొరేటర్​ పులగం వైష్ణవి సుధా. బీఎల్​వోల వద్ద నుంచి తీసుకున్న ఫారాలు వెంటనే తిరిగి బీఎల్​వోలకు ఇవ్వాలని సూచించారు. ఫారాలు తిరిగిచ్చిన వారికి బంపర్​ డ్రా నిర్వహిస్తామని ప్రకటించారు. మొదటి బహుమతిగా మిక్సీ, రెండో బహుమతిగా కుక్కర్​, మూడో బహుమతిగా ఫ్యాన్​, ఎలక్ట్రిక్​ కేటిల్​ అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా డివిజన్​లోని ఆయా కాలనీల్లో బంపర్​డ్రా విషయంపై కరపత్రాలు పంచిపెడుతున్నారు. తద్వారా ఫారాలను బీఎల్​వోలకు అందజేయాలని సూచిస్తున్నారు. ఈ ప్రయోగం ఫలించి ఓటర్లు తమ వద్ద ఉన్న ఫారాలను బీఎల్​వోలకు అందజేస్తారని కార్పొరేటర్​ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Congress SIR Plan | ‘సర్’​ పర్యవేక్షణకు కాంగ్రెస్ ప్రణాళిక.. పర్యవేక్షకులు, అసెంబ్లీ కోఆర్డినేటర్ల నియామకం..​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *