Temple Hundi Security | ఆలయ హుండీలకు ‘డిజిటల్’ భద్రత.. కర్ణాటక ప్రభుత్వ కొత్త నిబంధనలు

దేశవ్యాప్తంగా వివిధ ఆలయాల్లో చోటుచేసుకుంటున్న హుండీ చోరీలు, నిధుల దుర్వినియోగం వంటి ఘటనలను దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Temple Hundi Security | దేశవ్యాప్తంగా వివిధ ఆలయాల్లో చోటుచేసుకుంటున్న హుండీ చోరీలు, నిధుల దుర్వినియోగం వంటి ఘటనలను దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ( Karnataka )ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆలయ నిధుల భద్రత, లెక్కల్లో పారదర్శకత కోసం కఠినమైన నిబంధనలను రూపొందించింది.

Temple Hundi Security | కొత్త నిబంధనలు..

హుండీల వద్ద నాలుగు వైపులా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం తప్పనిసరి చేశారు. వీటి ప్రత్యక్ష ప్రసారాలను పోలీసు శాఖ, జిల్లా అధికారులు , ముజ్రాయి శాఖ ప్రధాన కార్యాలయంతో అనుసంధానించనున్నారు. నగదు రూపంలోనే కాకుండా యూపీఐ, భీమ్, క్యూఆర్ కోడ్ ద్వారా విరాళాలు ఇచ్చేలా భక్తులను ప్రోత్సహిస్తారు. ఈ డిజిటల్ చెల్లింపులను నేరుగా ఆలయ అకౌంటింగ్ వ్యవస్థతో అనుసంధానిస్తారు. హుండీల లెక్కింపు ప్రక్రియ ఇకపై తహసీల్దార్ పర్యవేక్షణలోనే జరుగుతుంది. హుండీ తెరవడం నుంచి నగదును బ్యాంకులో జమ చేసే వరకు ప్రతి క్షణాన్ని వీడియో రికార్డ్ చేయడం తప్పనిసరి.

Temple Hundi Security | ప్రత్యేక కమిటీలను..

లెక్కింపు సమయంలో కేవలం బ్యాంకు సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, హోంగార్డులకు మాత్రమే అనుమతి ఉంటుంది. సాధారణ ప్రజలను అనుమతించరు. ఏదైనా ఆలయంలో చోరీ జరిగితే, దానికి సంబంధిత ఆలయ , రెవెన్యూ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాలో కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలు ప్రతి నెలా సమీక్ష సమావేశాలు నిర్వహించి, నిధుల భద్రతను పర్యవేక్షిస్తాయి.

ఇది కూడా చదవండి: Devadula Project | దేవాదుల ద్వారా 22 రిజర్వాయర్లు నింపుతాం : డిప్యూటీ సీఎం భట్టి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *