అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Godavari Water | కేసీఆర్ బయటికి వచ్చి నిజాలు చెప్తే ప్రజలు కాంగ్రెస్ నాయకులను ఉరికించి కొడతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కేసీఆర్ బయటకు రావడం లేదని, ఫామ్‌హౌజ్‌కు పరిమితం అయ్యారని వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆయన స్పందించారు.
కరీంనగర్‌లో లోయర్ మానేరు ప్రాజెక్ట్ (LMD) నీటిమట్టాన్ని కేటీఆర్ సోమవారం పరిశీలించారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన శ్యామ్ ప్రసాద్ రెడ్డిని పట్టుకొని రేవంత్ రెడ్డి చర్లపల్లి జైల్లో వేయాలని అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర హితం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతుంటే బట్ట కాల్చి నా మీద వేసి, నన్ను చర్లపల్లి జైలుకు పంపాలని అంటున్నారని శ్యామ్ ప్రసాద్ రెడ్డి బాధపడ్డారన్నారు.
Godavari Water | రక్తం ఇస్తాం.. నీళ్లు ఇవ్వు
తమ రక్తమే కళ్ల చూస్తానని అంటే రేపే ఇస్తామని కేటీఆర్ అన్నారు. .. కానీ రైతులకు నీళ్లు ఇవ్వాలని కోరారు. రేవంత్ రెడ్డి తమ రక్తం తీసుకొని పంటలకు వేసి పండించాలని అన్నారన్నారు. రక్తదాన ప్యాకెట్లు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తున్న బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Godavari Water | కాళేశ్వరంలో అన్ని బాగున్నాయి
కాళేశ్వరం పథకంలో అన్ని నిక్షేపంగా ఉన్నాయని, ఒక్క రేవంత్ రెడ్డి బుర్ర తప్ప అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాళేశ్వరంలో రిజర్వాయర్లు, బ్యారేజీలు, పంప్ హౌస్‌లు, కెనాల్‌లు, మోటార్లు, సబ్‌స్టేషన్‌లు మంచిగానే ఉన్నాయన్నారు. కేసీఆర్ ఒక్క మాట చెబితే తామే పోయి పంపులు ఆన్ చేస్తామన్నారు.
మొత్తం గోదావరి బేసిన్‌లో ఉన్న కొండపోచమ్మ, మల్లన్న సాగర్, అప్పర్ మానేర్, మిడ్ మానేర్, అన్నపూర్ణ, అన్నారం ప్రాజెక్టుల్లో 20 శాతం కంటే నీళ్లు ఎక్కడా లేవని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రోజుకు 9 టీఎంసీ నీళ్లు కిందకు పోతున్నా.. ప్రభుత్వం ప్రాజెక్ట్‌లను నింపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌తో సహా LMD మీద ఆధారపడ్డ 9 నియోజకవర్గాలకు తాగునీటి సమస్య రాబోతుందన్నారు.
గోదావరి బేసిన్‌లో ఒక్క డ్యాం, రిజర్వాయర్‌లో కూడా 20 శాతానికి మించి నీళ్లు లేవు.
కన్నేపల్లి దగ్గర రోజుకు 9 టీఎంసీల నీళ్ళు కిందకి పోతున్నయి.. మేడిగడ్డ బ్యారేజీని ముట్టుకోకుండా వాటిని ఎత్తిపోయొచ్చు.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకుంటుంది.
– కరీంనగర్‌లో లోయర్ మానేరు డ్యాం… pic.twitter.com/FRpuJxkEvg
— Mission Telangana (@MissionTG) July 13, 2026
దీనిని కూడా చదవండి : Shabad Murder Case | షాబాద్ ఆరుగురి హత్య కేసు.. నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య