Revanth Reddy | హైదరాబాద్‌కు ఐఐఎంను తీసుకురావాలి..బీజేపీ ఎంపీలు చొరవ చూపాలి : సీఎం రేవంత్ రెడ్డి

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Revanth Reddy | హైదరాబాద్‌ Hyderabad లో భారతీయ నిర్వహణ సంస్థ (IIM) ఏర్పాటు కోసం బీజేపీ ఎంపీలు చొరవ చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని పేర్కొంటూ పలు కీలక అంశాలపై కేంద్రం మద్దతు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Revanth Reddy | మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు

మెట్రో రైలు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలని సీఎం కోరారు. అలాగే ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చిందని, కేంద్రం నుంచి అవసరమైన నిధులు సమీకరించి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

SI Pujari Suspension | మైనర్ డ్రైవింగ్‌కు ప్రోత్సాహం.. ఎస్సై పూజారి తిరుపతిపై సస్పెన్షన్

మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద అనుమతులు, నిధులు మంజూరు అయ్యేలా కృషి చేయాలని కూడా ఆయన సూచించారు.

రాష్ట్రానికి కీలకమైన మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో కేంద్రం సహకారం అందితే అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

cm revanth 10

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *