Old Coin Scam | పాత నాణేల పేరిట రూ.64 వేలు టోకరా

సోషల్ మీడియాలో వచ్చే ఆఫర్లను నమ్మి మోసపోవద్దని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా కొందరు అత్యాశతో బలవుతున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Old Coin Scam | సోషల్ మీడియాలో వచ్చే ఆఫర్లను నమ్మి మోసపోవద్దని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా కొందరు అత్యాశతో బలవుతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో(Kamareddy) ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

Old Coin Scam | ఫేస్​బుక్​లో..

ఫేస్‌బుక్‌లో పాత నాణేలు, నోట్ల ప్రకటన చూసి మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామానికి చెందిన బెల్లపు కొమురయ్య రూ.64 వేలు పోగొట్టుకున్నారు. ఎస్సై అనిల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫేస్‌బుక్‌లో ‘పాత నాణేలు, పాత నోట్లు ఉంటే అధిక ధర చెల్లిస్తాము’ అనే ప్రకటన చూసిన కొమురయ్య అందులోని నంబర్‌కు ఫోన్ చేశారు. సైబర్ నేరస్థులు అధిక లాభాలు వస్తాయని నమ్మించి వివిధ బ్యాంకు ఖాతాలు, క్యూఆర్ కోడ్‌ల ద్వారా దశల వారీగా రూ.64 వేలు చెల్లించేలా చేశారు.

తర్వాత మళ్లీ డబ్బు కావాలని ఒత్తిడి చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే 1930 జాతీయ సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా మాచారెడ్డి పోలీసులు (Machareddy Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సోషల్ మీడియాలో వచ్చే అధిక లాభాల ప్రకటనలను నమ్మవద్దని, తెలియని వ్యక్తుల ఖాతాలకు లేదా క్యూఆర్ కోడ్‌లకు డబ్బు పంపవద్దని ఎస్సై అనిల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏదైనా సైబర్ మోసం జరిగితే వెంటనే 1930కు ఫోన్ చేసి సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఇది కూడా చదవండి: లులు మాల్‌లో గన్ కలకలం 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *