అక్షరటుడే వెబ్‌డెస్క్: Prashanth Reddy Detention | నిజామాబాద్ జిల్లా వేల్పూరులోని తన నివాసం వద్ద నిరాహార దీక్ష చేపట్టాలని భావించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలాన్ని రేపింది. భీంగల్ మున్సిపాలిటీ అభివృద్ధి, 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, ఆర్టీసీ డిపో పునరుద్ధరణ వంటి ప్రజా సమస్యలపై ప్రభుత్వం వైఖరిని నిలదీయాలని ఆయన నిర్ణయించుకోగా, పోలీసులు దీక్షను అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు. ప్రశాంత్ రెడ్డి గృహ నిర్బంధాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు.
Prashanth Reddy Detention | ఖూనీ చేస్తున్న ప్రభుత్వం..
ప్రజా సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరాహార దీక్ష చేపట్టేవారిని కూడా నిర్బంధించడం దారుణమని, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. “ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూనే, ప్రతిపక్షాలను నిర్బంధించి పోలీస్ రాజ్యాన్ని నడుపుతున్నారు. హిట్లర్ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారు” అని ఆయన ‘ఎక్స్’ వేదికగా హెచ్చరించారు. ప్రజా సమస్యలపై గొంతు ఎత్తే ప్రతిపక్ష నేతలపై అణచివేత ధోరణిని మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Prashanth Reddy Detention | దుర్మార్గమైన చర్య..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. శాంతియుత దీక్షను అడ్డుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షాలను అణచివేయడమే లక్ష్యంగా మారిందని ఆరోపించిన కేటీఆర్, ప్రభుత్వం వెంటనే ప్రశాంత్ రెడ్డిపై విధించిన గృహ నిర్బంధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ గృహ నిర్బంధంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతుండగా, ప్రభుత్వం మాత్రం దీనిపై ఎటువంటి స్పందన వ్యక్తం చేయలేదు.
బాల్కొండ నియోజకవర్గం, వేల్పూర్‌లోని తన నివాసంలో ఎమ్మెల్యే @VPR_BRS గారిని పోలీసులు నిర్బంధించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.
భీంగల్ మున్సిపాలిటీ అభివృద్ధి, 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, ఆర్టీసీ డిపో పునరుద్ధరణ వంటి ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ… pic.twitter.com/4dSlsGuOSc
— Harish Rao Thanneeru (@BRSHarish) July 15, 2026
ఇది కూడా చదవండి: India UK FTA | భారత్-బ్రిటన్ ఒప్పందం.. భారీగా తగ్గనున్న దిగుమతి సుంకాలు