Nizamabad General Hospital | జీజీహెచ్​లో మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి: ఎమ్మెల్యే ధన్​పాల్​

నిజామాబాద్​ నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులు అనేక సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Nizamabad General Hospital | నగరంలోని (Nizamabad) ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని..వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana) తెలిపారు. జిల్లా జనరల్ ఆస్పత్రి డెవలప్​మెంట్​ సొసైటీ సమావేశం బుధవారం నిర్వహించారు.

Nizamabad General Hospital | అధికారులు.. సిబ్బంది బాధ్యతగా పనిచేయాలి..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆస్పత్రిలోని ప్రతి విభాగం అధికారులు సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే అన్నారు. ప్రధానంగా వైద్యులు హాజరు విషయంలో రాజీ పడేది లేదని, ప్రతిఒక్కరూ నాణ్యమైన సేవలు అందించాలని కోరారు. ఆస్పత్రిలో సివిల్ వర్క్ సమస్యలు అనేకంగా నెలకొన్నాయని, వాటిని పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. చాలా సమయాల్లో ల్యాబ్, ఎక్స్​రే తదితర వాటికోసం వచ్చే వారికి ఇబ్బందులు కలుగుతున్నాయని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అలాగే కొందరు కిందిస్థాయి సిబ్బంది రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రతి విభాగాధిపతి సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ చేయాలన్నారు.

Nizamabad General Hospital | రోగులకు ఉత్తమ సేవలందించాలి..

అధికారులు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ రోగులకు ఉత్తమమైన వైద్య సేవలు అందించాలని అర్బన్ ​ఎమ్మెల్యే సూచించారు. వచ్చే సమావేశానికల్లా సమస్యలన్నీ పరిష్కారం అయ్యే విధంగా చొరవ తీసుకోవాలని తెలిపారు. ప్రధానంగా పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి, మేయర్ కూరగాయల ఉమారాణి, డిఎంహెచ్వో రాజశ్రీ, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములు తదితరులు పాల్గొన్నారు.

dhanpal1

ఇది కూడా చదవండి : టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జీల నియామకం 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *