Telangana Rain Alert | తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు..

తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Rain Alert | తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ( Hyderabad ) వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. రాజధాని హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో సాయంత్రం, రాత్రి వేళల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటిపూట ఆకాశం మేఘావృతమై ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

Telangana Rain Alert |ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

ముఖ్యంగా ఉత్తర , ఈశాన్య తెలంగాణ జిల్లాలపై అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, సిద్దిపేట , మెదక్ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఇది కూడా చదవండి:  Kamareddy SI Transfers | కామారెడ్డి జిల్లాలో ఎస్సైల బదిలీలు.. కీలక స్టేషన్లలో అధికారుల మార్పు..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *