అక్షరటుడే, వెబ్‌డెస్క్: US Airstrikes Chabahar | ఇరాన్ (Iran)లోని చాబహార్ ఓడరేవు వద్ద కీలక మౌలిక సదుపాయాలపై అమెరికా దాడులు చేసింది. చాబహార్ పోర్టులో శుక్రవారం జరిగిన అమెరికా వైమానిక దాడుల కారణంగా మారిటైమ్ కంట్రోల్ టవర్ కూలిపోయింది.
కూలిపోతున్నట్లుగా కనిపిస్తున్న ఆ నిఘా టవర్ చిత్రాన్ని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పంచుకున్నారు. చాబహార్ పోర్టు అమెరికా వైమానిక దాడులకు పదేపదే లక్ష్యంగా మారుతోంది. ఆ పోర్టుపై మూడో విడత దాడులు జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా అంగీకరించింది, కానీ టవర్ కూలిపోయిన విషయాన్ని ధృవీకరించలేదు. పోర్టులోకి జరిగే వాణిజ్య రవాణాను ఆ టవర్ పర్యవేక్షిస్తుందని ఇరాన్ పేర్కొంది.
US Airstrikes Chabahar | బాంబుల వర్షం
ఇరాన్‌లోని దక్షిణ ప్రాంతంలో దీవులు, నగరాలపై అమెరికా పెద్ద ఎత్తున దాడులు చేసింది. అహ్వాజ్, ఖేష్మ్, దాష్తి, సిరిక్, బందర్ ఈ లెంగేలో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. బందర్ ఈ ఖమీర్‌లో రెండు బ్రిడ్జిలు ధ్వంసం అయ్యాయి. ఇరాన్‌షహర్‌లో ఎయిర్‌పోర్టుపై సైతం యూఎస్ దాడి చేసింది. అమెరికా దాడుల్లో ఇరాన్లో ముగ్గురు చనిపోయారు.
ఇది కూడా చదవండి..: Trump China Allegations | చైనాపై ట్రంప్ సంచలన ఆరోపణలు