Illegal Liquor Sales | అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ దాడులు.. సిట్టింగ్​ నిర్వహిస్తున్న మెస్​ యజమాని అరెస్టు

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని హోటళ్లు, మెస్​లు, దాబాలపై ఎక్సైజ్ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Illegal Liquor Sales | కామారెడ్డి (Kamareddy) మున్సిపాలిటీ పరిధిలోని హోటళ్లు, మెస్​లు, దాబాలపై శనివారం ఎక్సైజ్ (Excise Raids) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్నట్లు అందిన సమాచారంతో డిగ్రీ కాలేజీ గ్రౌండ్ ఎదురుగా ఉన్న లక్ష్మీ మెస్​ను తనిఖీ చేశారు.

Illegal Liquor Sales |అనుమతి లేకుండా విక్రయాలు..

Messలో అనుమతి లేకుండా మద్యం సిట్టింగ్​, మెస్ నిర్వహిస్తున్న దిలీప్ రెడ్డిపై కేసు(Kamareddy Police) నమోదు చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీలోని ఏ హోటల్, మెస్ లేదా దాబాలో అనుమతి లేకుండా మద్యం అమ్మినా, తాగడానికి అనుమతించినా కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ హెచ్చరించారు.

అక్రమ మద్యం విక్రయాలకు సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని కోరారు. ఈ దాడుల్లో ఎస్సై విక్రమ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ ఫరీద్, కానిస్టేబుల్స్ రాజు, దినేష్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: CBSE 10th Results | CBSE 10వ తరగతి రెండో బోర్డు పరీక్షల ఫలితాలు విడుదల.. DigiLockerలో రిజల్ట్స్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *