SBI Funds IPO | నిరాశపరిచిన ‘ఎస్‌బీఐ ఫండ్స్’.. స్వల్ప లాభాలతో లిస్టింగ్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ ఐపీవో ఇన్వెస్టర్లకు నామమాత్రపు లాభాలను అందించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: SBI Funds IPO | భారతదేశపు పురాతన, అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలలో ఒకటైన ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ కంపెనీ స్టాక్ మార్కెట్‌ (Stock market) నుంచి రూ. 9,813 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్. సభ భాగస్వాములైన ఎస్‌బీఐ, అముండీ ఇండియా హోల్డింగ్ ఈ ఐపీవో ద్వారా తమ వాటాలను విక్రయించారు. ఐపీవో సబ్‌స్క్రిప్షన్ ఈనెల 14 న ప్రారంభమై 16 వరకు కొనసాగింది.

SBI Funds IPO | స్వల్ప లాభాలతో సరి..

ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ షేర్లు మంగళవారం ఎన్ ఎస్ ఈ, బీఎస్ ఈలలో లిస్టయ్యాయి. ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 574 కాగా.. రూ. 613.30 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. గ్రే మార్కెట్ ప్రీమియం 16 శాతం వరకు ఉన్నా.. మార్కెట్‌లో అనిశ్చితుల కారణంగా 6.85 శాతం ప్రీమియంతోనే లిస్టవడంతో ఐపీవో అలాట్ అయినవారు కాస్త నిరాశ చెందారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఒక్కో షేరు ధర రూ. 623 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి..: Family Asset Trust | ఆస్తి రక్షణకు ధనికుల ఫైనాన్స్ సీక్రెట్: తరతరాలుగా సిరిసంపదలను కాపాడే ‘ట్రస్ట్’ విధానం!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *